| Daily భారత్
Logo




క్రమశిక్షణ, ఐక్యత, సమిష్టి కృషితోనే విజయాన్ని సాధించగలం : బిజెపి పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్

News

Posted on 2026-01-02 19:10:53

Share: Share


క్రమశిక్షణ, ఐక్యత, సమిష్టి కృషితోనే విజయాన్ని సాధించగలం : బిజెపి పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్

డైలీ భారత్, సిరిసిల్ల:రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికలలో తమ తమ వార్డుల నుండి పోటీ చేయదలచుకున్న ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహం, వార్డు స్థాయి సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ..

రాబోయే మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైనవిగా నిలవనున్నాయి. ప్రజలకు నిబద్ధతతో పనిచేసే, సేవాభావం కలిగిన, పార్టీ సిద్ధాంతాలకు అంకితమైన కార్యకర్తలకే అవకాశం కల్పించబడుతుంది. వార్డు స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే నాయకత్వాన్ని బీజేపీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఎన్నికల ద్వారా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ జెండా ఎగరేయడమే మా లక్ష్యం అని అన్నారు. పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, సమిష్టి కృషితోనే విజయాన్ని సాధించగలమని, ప్రతి కార్యకర్త ఎన్నికలను సవాలుగా తీసుకుని పూర్తి స్థాయిలో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు, వివిధ మోర్చాల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >