డైలీ భారత్, కామారెడ్డి : వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న శుభ సందర్భంలో, 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేళ... ప్రజల్లో దేశ భక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి స్ఫూర్తితో ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి నాయకత్వంలో గాంధీ గంజ్ నుండి ప్రారంభమై పట్టణ పురవీధుల గుండా JPN రోడ్, సుభాష్ రోడ్డు, తిలక్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది.
త్రివర్ణ పతాక రెపరెపల మధ్య దేశభక్తి చాటే ఈ మహా ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా లో జాతీయ గీతం జనగణమన ఆలాపన తో ముగిసింది. ఈ ర్యాలీలో పట్టణంలోని వ్యాపారస్తులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.