| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

డైలీ భారత్, కామారెడ్డి:జిల్లా ప్రజలకు శుభవార్త. ఇక అధునాతన చికిత్సల కోసం హైదరాబాద్ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కామారెడ్డి యశోద మెడికల్ సెంటర్‌లో కోతలు లేకుండా చేసే POEM సర్జరీని విజయవంతంగా నిర్వహించి యశోద హాస్పిటల్స్ కొత్త మైలురాయిని సృష్టించింది.

బుధవారం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. అన్నం, నీరు కూడా మింగలేక ఇబ్బంది పడుతున్న 40 ఏళ్ల వ్యక్తికి ఎండోస్కోపీ ద్వారా POEM - Peroral Endoscopic Myotomy చికిత్స చేశారు. పెద్ద కోతలు లేకుండా చేసిన ఈ ప్రక్రియతో రోగి త్వరగా కోలుకుంటున్నాడు.

వైద్యులు ఏమన్నారు:

ఈ చికిత్స గురించి యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. బి. శృతి సాగర్ వివరించారు. ఆమె MD, DM (Gastro) పట్టా కలిగి ఉన్నారు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, మ్యానోమెట్రీ, ERCP, EUS వంటి అధునాతన గ్యాస్ట్రో విధానాల్లో ఆమెకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.

స్థానికులకు ఉపయోగం:

కామారెడ్డి యశోదలో ఇప్పుడు అధునాతన గ్యాస్ట్రో చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. దీనితో జిల్లా ప్రజలు సమయం, డబ్బు రెండూ ఆదా చేసుకోవచ్చు. Achalasia వంటి మింగడానికి సంబంధించిన వ్యాధులకు POEM చికిత్స అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని డాక్టర్లు తెలిపారు.

Previous అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం
Next కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ
ADVERTISEMENT