| Daily భారత్
Logo




డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలి : సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్

News

Posted on 2026-01-02 18:51:36

Share: Share


డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలి : సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్

డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలని సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. 

డైలీ భారత్ వేములవాడ: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్ల  జిల్లా రవాణా శాఖ సిబ్బంది శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కార్ల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు. స్పీడ్ కంట్రోల్ లో ఉండాలని, వాహనం రివర్స్ లో వెళ్లేప్పుడు తప్పనిసరిగా వాహనం కింద, వెనుక గమనించాలని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని వాహనాన్ని నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలను నడిపిన వారికి దాని ప్రాముఖ్యత గురించి తెలిపారు. వాహనాలకు వాహన భద్రతా స్టిక్కర్లు అతికించారు. సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడుపుతామని వాహన దారులతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. 


కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.


#rajannasircilla

Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >