| Daily భారత్
Logo




ఈర్ల కృష్ణవేణికి మార్పు స్వచ్చంధ సంస్థ చేయూత

News

Posted on 2026-01-02 13:28:39

Share: Share


ఈర్ల కృష్ణవేణికి మార్పు స్వచ్చంధ సంస్థ చేయూత

డైలీ భారత్, వైరా:మార్పు స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ బజార్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహిళా ఈర్ల కృష్ణవేణికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న ఈర్ల కృష్ణవేణి భర్త ఈర్ల రమేష్  కీడ్నీ వ్యాదితో బాధపడుతూ ఇటీవల కాలంలో మరణించారు. భర్త అకాల మరణంతో కుటుంబ పోషణకు, ఇద్దరు ఆడపిల్లలను చదివించడానికి ఈర్ల కృష్ణవేణి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని సిపిఐ(ఎం) వైరా శాఖ సభ్యులు ద్వారా తెలుసుకున్న మార్పు స్వచ్ఛంధ సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత శుక్రవారం స్వయంగా కృష్ణవేణి ఇంటికి వెళ్ళి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిన నేటి సామాజిక పరిస్థితులలో ఒక మహిళ ఒంటరిగా కుటుంబ బాధ్యతలు మోయడం, ఇద్దరి ఆడ పిల్లలను చదివించడం చాలా కష్టమైన విషయం అన్నారు. చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నవారికి చాలా ఉపయోగ పడుతుందని, మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి ఈర్ల కృష్ణవేణి కుటుంబానికి సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో  మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల మోహనరావు, సిపిఐ(ఎం) వైరా శాఖ కార్యదర్శి ఓర్పు సీతారాములు,  శాఖా సభ్యులు వల్లెపు ఏడుకొండలు, దేవళ్ళ క్రిష్ణ, బత్తుల ప్రమీల, దేవళ్ళ మంగ, బండారి మేఘన తదితరులు పాల్గొన్నారు

Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >
Image 1

ఢిల్లీలో హైఅలర్ట్‌... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!

Posted On 2026-08-12 07:04:48

Readmore >
Image 1

నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!

Posted On 2026-08-12 06:40:50

Readmore >
Image 1

పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!

Posted On 2026-08-12 05:16:11

Readmore >
Image 1

మృత్యుఘోష... రెండు వేర్వేరు ప్రమాదాలు.. 9 మంది దుర్మరణం!

Posted On 2026-08-11 18:43:27

Readmore >
Image 1

రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్

Posted On 2026-08-11 16:27:51

Readmore >
Image 1

నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు

Posted On 2026-08-11 14:45:05

Readmore >
Image 1

సకాలంలో ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సతో కాపాడిన ప్రాణం...

Posted On 2026-08-11 14:22:00

Readmore >