| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు

ఫిబ్రవరి 1 నుంచి భారీగా పెరగనున్న సిగరెట్, పాన్ మసాలా ధరలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కొత్త ఏడాదిలో సిగరెట్, పాన్ మలాసా ప్రియులకు కేంద్రం షాకిచ్చింది. ఫిబ్రవరి 1 నుంచి వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. సిగరెట్, పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ, బీడీలపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.పాన్ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్ పెంపుతో పాటు.. పొగాకు సంబంధిత ఉత్పత్తులకు అదనంగా ఎక్సైజ్ సుంకం విధించింది. ఇవి కూడా ఫిబ్రవరి1 నుంచి అమల్లోకి రానున్నది. తయారీ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి సెస్ చెల్లించవలసి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Previous దారుణం... ముగ్గురు పిల్లలకు విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య
Next డిసెంబర్ 31 రాత్రి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 130పట్టివేత : సీ.పి. సాయి చైతన్య
ADVERTISEMENT