Posted on 2026-01-01 09:42:48
డైలీ భారత్, నంద్యాల: ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రే తన ముగ్గురు చిన్నారులను విషమిచ్చి.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలంగా మారింది. ఈ అనూహ్య ఘటనతో కుటుంబం పూర్తిగా ఛిద్రమవ్వడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొత్తంగా క్షణికావేశంలో, మానసిక ఒత్తిడితో మనుషులు మృగం లాగా మారిపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు అనడానికి ఇదో ఉదాహరణగా నిలుస్తుంది.
జిల్లాలోని ఉయ్యాలవాడ మండలం తొడుములదీన్నేలో కంటికి రెప్పలా బిడ్డలను కాపాడాల్సిన తండ్రి కాలయముడు లాగా మారాడు. వేములపాటి సురేంద్ర (34) మానసిక ఒత్తిడితో దారుణానికి ఒడిగట్టాడు. మద్యం మత్తులో ఉన్న సమయంలో తన పిల్లలపై దాడి చేసి హత్య చేశాడు. అనంతరం తానే ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం పరిస్థితిని మరింత విషమంగా మార్చింది.
ఈ దారుణ ఘటనలో తండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులను సిగిన్నారుకు కావ్య (7 సంవత్సరాలు), ధ్యానేశ్వరి (4 సంవత్సరాలు), సూర్య గగన్ (2 సంవత్సరాలు).. అత్యంత చిన్న వయసులోనే ముగ్గురు పిల్లలు మరణించడంతో గ్రామమంతా శోకసంద్రంగా మారింది. పిల్లల భవిష్యత్తు, కలలు ఇలా ఒక్కసారిగా చిద్రమవ్వడం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. కాగా పిల్లల తల్లి సుమారు 8 నెలల క్రితమే అనారోగ్యం కారణంగా ఆత్మహత్య చేసుకొని మరణించారు.
అప్పటి నుంచి సురేంద్ర ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సరైన మానసిక సహాయం లేకపోవడం ఈ విషాదానికి దారి తీసి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడిస్తామని తెలిపారు.
"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"
Posted On 2026-08-14 18:18:19
Readmore >
కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు
Posted On 2026-08-14 18:10:20
Readmore >
ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం
Posted On 2026-08-14 18:05:57
Readmore >
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు
Posted On 2026-08-14 18:03:54
Readmore >
ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!
Posted On 2026-08-14 09:52:38
Readmore >
ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...
Posted On 2026-08-14 06:28:01
Readmore >
టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!
Posted On 2026-08-14 06:22:20
Readmore >
మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!
Posted On 2026-08-14 05:44:28
Readmore >
పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్
Posted On 2026-08-14 05:41:23
Readmore >