Posted on 2026-01-01 08:28:27
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
డైలీ భారత్, సూర్యాపేట:కోదాడ పట్టణానికి చెందిన దళితుడు కర్ల రాజేష్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌కు రాజేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వినతిపత్రం అందించారు. అనంతరం మంద కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ కర్ల రాజేష్ మృతికి కారణమైన చిలుకూరు ఎస్‌ఐని డిస్మిస్ చేయాలని సీఐ, డీఎస్పీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేష్ రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని నిపుణులతో రాజేష్ మృతదేహానికి రీ పోస్టు మార్టం చేయాలని కోరారు. జైభీమ్ సినిమా మాదిరిగా పోలీసుల కుట్రలు ఉన్నాయని, రాజేష్‌ను చిత్రహింసలు పెట్టి ఎలాగైనా చనిపోయేలా ఉన్నాడన్న తొందరలో కోర్టులో ప్రవేశపెట్టారని తెలిపారు. చిలుకూరు ఎస్‌ఐని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ కేసును కనుమరుగయ్యేలా చేయాలని చూస్తున్నారని, మరింత ప్రజా ఉద్యమంలా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు. జనవరి 10వ తేదీన కోదాడలో కర్ల రాజేష్ సంతాపసభ నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు, సామాజిక న్యాయం కోరే ప్రజాసంఘాలతో తమ పోరాటం ఉధృతం చేస్తామని తెలిపారు. తమ విన్నపంపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని చెపన్పారు. ఆయన వెంట ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ పాల్గొన్నారు.
ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..
Posted On 2026-08-12 21:16:37
Readmore >
సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు
Posted On 2026-08-12 10:06:43
Readmore >
ఢిల్లీలో హైఅలర్ట్... స్వాతంత్ర్య దినోత్సవం వేళ 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల!
Posted On 2026-08-12 07:04:48
Readmore >
నకిలీ డిగ్రీల న్యాయవాదులపై ఎఫ్‌ఐఆర్‌ల పర్వం.. 105 మందిపై నిఘా!
Posted On 2026-08-12 06:40:50
Readmore >
పాన్ మసాలా ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం... సంచలన గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
Posted On 2026-08-12 05:16:11
Readmore >
రైల్లో భారీ గంజాయి స్మగ్లింగ్ భగ్నం... కామారెడ్డి స్టేషన్‌లో 6 కేజీలు సీజ్
Posted On 2026-08-11 16:27:51
Readmore >
నిబంధనలు పాటించాలి... ప్రైవేట్ ఆసుపత్రులకు సిరిసిల్ల DMHO కీలక ఆదేశాలు
Posted On 2026-08-11 14:45:05
Readmore >