| Daily భారత్
Logo




గ్రామాభివృద్ధికి సర్పంచులు అహర్నిశలు కృషి చేయాలి : గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

News

Posted on 2025-12-29 04:01:05

Share: Share


గ్రామాభివృద్ధికి సర్పంచులు అహర్నిశలు కృషి చేయాలి : గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులుగా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి సూచించారు. ఆదివారం షాబాద్ కేంద్రంలో ఎస్సార్ పెట్రోల్ బంక్  యజమాని తాజోద్దీన్ వారి కుమారుడు సిరాజోద్దీన్ నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మదుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వయంపాలనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల బలోపేతానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్‌లకుసూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నూతనంగా గెలిచిన సర్పంచులు అశోక్, లావణ్యచెన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, స్వరూపమహేందర్ గౌడ్, శాంతమ్మయాదయ్య, ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, వార్డుసభ్యులు చంద్రయ్య, శ్రీనివాస్, యోగేశ్వర్, సర్దార్నగర్ ఏఎంసీ డైరెక్టర్లు అక్తర్ పాషా, సంజీవరెడ్డి,నాయకులు ఖుద్దూస్, ఖాజామియాపటేల్, మోహిజోద్దీన్, సుభాష్ రెడ్డి, గౌరీశ్వర్, రమేష్, రామస్వామి, అంజనేయులు, నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >