Posted on 2025-12-27 17:23:49
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:తమకు పాతపద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టులు ఆందోళనకుదిగారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగాతెచ్చిన జిఓ 252 జర్నలిస్టుల ను విభజించేవిధంగా ఉందని శనివారం నిజామాబాద్ జిల్లాకలెక్టరేట్ వద్ద డీజేఎఫ్ టీ (ఉమ్మడి నిజామాబాద్ జిల్లా) శాఖ ఆధ్వర్యంలో నిరసనతెలిపారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం డెస్క్‌జరల్నిస్టులకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. ఇందుకోసమే జీవో 252నుతీసుకువచ్చిందని ఆరోపించారు. అక్రెడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలనికుట్ర పన్నిందని మండిపడ్డారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మరీ రాత్రి సమయంలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.విలేకరులు, డెస్క్ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. కానీ సర్కారుమాత్రం వివక్ష చూపిస్తోందని.. ఇది సరైనది కాదని పేర్కొన్నారు. జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలనిడిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పదని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ ఏవో ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు. డెస్క్‌జర్నలిస్టుల కు వివిధ యూనియన్ ల మద్దతు...డెస్క్‌జర్నలిస్టుల ఆందోళనకు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. అనంతరం ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డెస్క్ లో ఉండి వార్తలు వ్రాసే వారే అసలైన వారని, వారు రాసిన వార్తను మరునాడు వివిధ దినపత్రికల్లో ప్రచురింపబడతాయని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో వివిధ దినపత్రికల్లో డెస్క్ లో పనిచేసే ఉద్యోగులపై ప్రభుత్వం పునారాలో చేయాలన్నారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు ఐ అండ్ పీఆర్ ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని పేర్కొన్నారు. కార్యక్రమంలోవివిధ సంఘాల నాయకులు జమాల్‌పూర్ గణేశ్, భద్రారెడ్డి, సుభాష్, పంచరెడ్డిశ్రీకాంత్, భూపతి, సీనియర్ జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >