డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన స్వరూప, కుబేరడును అను ఇద్దరిని అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు 3 టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు, 4 టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు.
News
ప్రభుత్వ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నమ్మించి టోకరా వేసిన కిలాడీ లేడీ అరెస్ట్