Posted on 2025-12-27 04:40:12
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ పాతబస్తీ మొఘల్‌పురా బీబీ బజార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ యాదవ్ పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు.విధుల నిర్వహణలో భాగంగా హోమ్ గార్డ్ హస్సాన్‌తో కలిసి ట్రాఫిక్ నియంత్రణ చేపడుతున్న సమయంలో ఒక మొబైల్ ఫోన్ లభ్యమైంది. దాన్ని స్వాధీనం చేసుకున్న వెంటనే సంబంధిత యజమానిని గుర్తించేందుకు విచారణ ప్రారంభించారు.విచారణలో ఆ మొబైల్ ఫోన్ అదే ప్రాంతంలో జీవనాధారం కోసం ఆటో నడుపుతున్న ఓ ఆటో డ్రైవర్‌దిగా నిర్ధారణ అయింది. అవసరమైన అన్ని ధృవీకరణలు పూర్తయ్యాక మొబైల్ ఫోన్‌ను నిజమైన యజమానికి సురక్షితంగా అప్పగించారు. ఈ ఘటనతో పోలీసుల నిజాయితీ, సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆస్తిని కాపాడడంలో ట్రాఫిక్ పోలీసులు చూపిన బాధ్యతాయుత వైఖరిని స్థానికులు ప్రశంసిస్తూ కానిస్టేబుల్ అరుణ్ కుమార్ యాదవ్‌ను అభినందించారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >