| Daily భారత్
Logo




నా భార్య నన్ను పట్టించుకోవడం లేదు..

News

Posted on 2025-12-25 17:25:57

Share: Share


నా భార్య నన్ను పట్టించుకోవడం లేదు..

న్యాయం కావాలంటూ రోడ్డెక్కిన భర్త

నిజామాబాద్ లో వింత ఘటన..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కోటి ఆశల బంధంతో పెళ్లి అనే ఒక జీవితాన్ని ప్రారంభించిన ఓ వ్యక్తికి, కేవలం 4 నెలలకే గుండెపగిలే అనుభవం ఎదురైంది. పెళ్లికే ముందే తన భార్యకు శారీరక సంబంధం ఉందని, పెళ్లాయ్యాక కూడా ఆ సంబంధం కొనసాగుతోందని  తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాడు. ఇక తనకు జరిగిన అన్యాయంపై పోరాటానికి దిగాడు ఆ భర్త. ఫెక్సీ వేయించి మరీ భార్య ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగాడు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన సంచలనంగా మారుతుంది. భార్య బాధితుడిగా మారి ధర్నా చేస్తున్న ఆ వ్యక్తి పేరు ప్రశాంత్. అతడికి నాలుగు నెలల క్రితం అంటే, ఆగస్టు 13న సంయుక్త అనే మహిళతో వివాహం జరిగింది. కానీ, తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పెళ్లి అయిన నాలుగు నెలల్లోనే గుర్తించానని ప్రశాంత్ ఆరోపిస్తున్నారు. భార్య వివాహేతర సంబంధాన్ని గుర్తించి, వినూత్న రీతిలో భర్త నిరసనకు దిగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లయిన అతి తక్కువ కాలంలోనే ఆమె ప్రవర్తనలో మార్పు రావడం, చాటింగ్ చేస్తున్నట్టుగా బాధిత భర్త గుర్తించాడు. దీంతో, ప్రియుడు లింబాద్రితో భార్య సంయుక్త జరిపిన వాట్సాప్ చాటింగ్లు, ఇతర కీలక ఆధారాలను ప్రశాంత్ సేకరించాడు. ఈ ఆధారాలతో పోలీసులను ఆశ్రయించినప్పటికీ, స్పందన లేకపోవడంతో నేరుగా ధర్నాకు గిదాడు. చట్టపరంగా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు. కేవలం ధర్నా చేయడమే కాకుండా, తన గోడును వెళ్లబోస్తూ ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. గత కొంతకాలంగా వాట్సాప్ స్టేటస్ లు పెట్టిన అతడు, ఇప్పుడు బహిరంగంగా రోడ్డుపైకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని పెళ్లి అయిన నాలుగు నెలల్లోనే గుర్తించానని ప్రశాంత్ ఆరోపణ చేస్తున్నాడు. బావ వరుస అయిన లింబాద్రి అనే వ్యక్తితో తన భార్య సంయుక్తకు వివాహేతర సంబంధం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు వారిద్దరి మధ్య జరిగిన చాటింగ్ను గుర్తించానని పేర్కొన్నాడు. వాట్సప్ చాటింగ్లను స్క్రీన్షాట్లు తీశాడు. భార్య మోసం చేసిందంటూ కొంతకాలంగా వాట్సప్లో స్టేటస్లు పెడుతున్నాడు. ఇక, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఒక ఫ్లెక్సీ వేయించి, భార్య ప్రియుడు లింబాద్రి ఇంటి ఎదుట ప్రశాంత్ ధర్నాకు బైఠాయించాడు. న్యాయం చేయాలంటూ అతడు ఆందోళన చేపడుతున్నాడు. న్యాయం కోరుతూ, ఫ్లెక్సీ పట్టుకొని బైఠాయించాడు. భార్య సంయుక్త, ఆమె బావ లింబాద్రి ఇద్దరి మధ్య జరిగిన చాటింగ్లు, ఇతర ఆధారాలు చూపించినా పోలీసులు పట్టించుకోవటం లేదని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.

Image 1

ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన

Posted On 2026-07-15 19:21:13

Readmore >
Image 1

అమీర్ ఖాన్ మూడో వివాహంపై ఫత్వా.. మత గురువు వ్యాఖ్యలు వైరల్

Posted On 2026-07-15 19:19:36

Readmore >
Image 1

యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-15 19:05:38

Readmore >
Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >