Posted on 2025-12-25 16:00:55
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అన్ని మతాల వారు సమానత్వంతో జీవించే గొప్ప సంప్రదాయం గల దేశం మనదని రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్,షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.గురువారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని షాద్ నగర్ పట్టణంలో సిఎస్కెలో షాద్ నగర్ నియోజకవర్గ క్రిస్టియన్ మైనారిటీ కోఆర్డినేటర్ రవితేజ నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కేకు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుప్రభువు జీవితం ప్రపంచ దేశాలకే ఆదర్శమని అన్నారు. ప్రేమ, క్షమ, త్యాగాలే ఆయన బోధల సారమని వివరించారు. క్రిస్మస్ పండుగను అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన ఆదివాసి రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్, పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్ ఫరూఖ్ నగర్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఇబ్రహీం,మొహమ్మద్ ఇసాక్,మహబూబ్, గంగమోని సత్తయ్య, శేఖర్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు..
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >