Posted on 2025-12-25 14:14:09
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: మాజీ ప్రధాని భారతదేశానికి మూడుసార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్పేయి నేటితరం యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101 జయంతి నీ పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ -
అపర మేధావి కవి అయినటువంటి మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్పేయి మాటల్లో మృదుత్వం అందరినీ ప్రేమగా పలకరించే స్వభావం కలిగిన వ్యక్తి అని అన్నారు. ప్రధానిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధి కోసం ఎన్నో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చరన్నారు. దేశ ప్రజల అభివృద్ధి సంక్షేమం భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న ఘనత ఆయన కే దక్కుతుందన్నారు. అణు పరీక్షల ఒప్పందం తదితర ఇతర ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గౌరవాన్ని తీసుకువచ్చారని, అదేవిధంగా వాజ్పేయి హయాంలో ఆడపిల్లల చదువు కోసం కీలక నిర్ణయాలు తీసుకొని ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో తెలియచెప్పి పురుషులతో సమానంగా ఆడపిల్లలు చదువుల్లో రాణిస్తారని మహిళల్లో ధైర్యం నింపిన వ్యక్తి ఆయన అని తన ప్రసంగంతో దేశ ప్రజలను ఎందరినో ఆకట్టుకున్నారని తెలిపారు. గత సంవత్సరం ఆయన 100వ జయంతి రోజున సుపరిపాలన దినోత్సవం గా ప్రకటించించారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ముఖ్యంగా నేటితరం యువత వాజ్పేయి వ్యక్తిత్వాన్ని పుస్తకాల్లో చదివి ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మీనారాయణ, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొతంకర్ లక్ష్మీనారాయణ, బీజేపీ మాజీ కార్పొరేటర్స్ ,బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్‌ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >