Posted on 2025-12-24 15:04:59
అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రోహిత్ అతని స్నేహితులపై అత్యాచార ఆరోపణలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఖలీల్ వాడిలోని పూజ ఆసుపత్రిలో తోటి మహిళ ఉద్యోగిపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. విధుల్లో ఉన్న యువతిపై ఆసుపత్రి లో ఉద్యోగం చేస్తున్న రోహిత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన యువతి అతని నుంచి తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచాణ చేపడుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ డెంటల్ వైద్యుడు, తన స్నేహితుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి తో కలిసి ఓ వివాహితను కొంతకాలంగా లైంగికంగా వేధించిన ఘటన మరవకముందే మళ్లీ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా ఓ మహిళ ఉద్యోగిపై అత్యాచార్య ఘటన వెలుగు చూడడం పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు ప్రైవేట్ ఆస్పత్రిలు అంటేనే సామాన్య ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. వైద్యం సంగతి అటు ఉంచితే, వైద్యం పేరిట దేవాలయాలాంటి ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం శోచనీయం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంత తతంగం జరుగుతున్న జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ అధికారిని మాత్రం ఆస్పత్రిల పట్ల ప్రవేట్ ఆసుపత్రి వైద్యుల పట్ల ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది.
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >