| Daily భారత్
Logo




ధర్మారం (బి)లో నూతనంగా విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్ ప్రమాణ స్వీకారం

News

Posted on 2025-12-22 15:32:25

Share: Share


ధర్మారం (బి)లో నూతనంగా విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి సర్పంచ్  ప్రమాణ స్వీకారం

హాజరైన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:డిచ్ పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో నూతన సర్పంచ్‌గా గొట్టిపాటి వాసుబాబు, ఉపసర్పంచ్‌గా సల్మాన్‌తో పాటు 12 మంది వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శాలువాలు కప్పి సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ధర్మారం (బి)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 1079 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. మహిళలు, యువత, విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వ సుపరిపాలన పట్ల నమ్మకం ఉంచి విజయాన్ని అందించారని చెప్పారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. మహిళల అభివృద్ధి కోసం పావుల వడ్డీపై రుణాలు అందుబాటులోకి తెచ్చి వారికి ఆర్థిక బలాన్నందిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పోలసాని శ్రీనివాస్, ప ఎ సి ఎస్ డైరెక్టర్ రామకృష్ణ, నూతన పాలకవర్గ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >