| Daily భారత్
Logo




రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల

News

Posted on 2025-12-22 13:28:56

Share: Share


రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి : రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన పాలకవర్గాలు రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలనీ రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంసందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది సర్పంచ్ ల  పంచాయతీలు చంద్రాలగూడెం, రేగుల గూడెం, బంజారా, మల్లారం, లక్ష్మీదేవిపల్లి, ఉల్వనూరు, కిన్నెరసాని, పాత సూరారం, కొత్త సూరారం, పాండురంగాపురం తండా, తవిశలగూడెం లలో  కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు పర్యటించి, ప్రమాణ స్వీకరణ ఉత్సవాలలో పాల్గొన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను బొకే, శాలువాలతో సన్మానించి, అభినందించారు. 

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ నూతన పాలకవర్గాలు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా, పంచాయతీని అభివృద్ధి పరచాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పంచాయతీలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ కే సాధ్యం అన్నారు. నూతన పాలకవర్గాలు నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలని కొత్వాల కోరారు.


ఈ కార్యక్రమాల్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాలే జానకిరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మాజీ జెడ్పిటిసియర్రంశెట్టి ముత్తయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న గౌడ్, కాంగ్రెస్ నాయకులు యర్రంశెట్టి మధుసూదన్ రావు, వుండేటి శాంతివర్ధన్, Y వెంకటేశ్వర్లు (YV), అలెక్స్, బరిపటి ఆనంద్, ముగిస్తే ముసలయ్య, వాసం మంగయ్య, కట్టా సోమయ్య, మాజీ ఎంపీపీ నారాయణ, నరసింహారావు, నీరుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >