| Daily భారత్
Logo




స్నేహ సొసైటీలో ఘనంగా సపోస్ క్రిస్మస్ వేడుకలు

News

Posted on 2025-12-22 11:59:17

Share: Share


స్నేహ సొసైటీలో ఘనంగా సపోస్ క్రిస్మస్ వేడుకలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రేమ, శాంతి, కరుణ, జాలి,దయ,మరొకరికి సహాయం చెయ్యడం, సోదరభావాన్ని పెంపొందించడం  వల్ల యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ప్రార్ధించడం జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారినితో పాటు ఫాస్టర్  రెవరెండ్ ఆరోన్, వక్తలు కొనియాడారు. క్రిస్టమస్ పండుగను పురస్కరించుకొని స్నేహ సొసైటీ దివ్యంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో వారు పేర్కొన్నారు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యంగుల పాఠశాలల్లో క్రిస్మస్ పండుగ , ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకోని  ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు...వేడుకల్లోభాగంగా పశువుల పాక, క్రిస్మస్ చెట్టు, అలంకరణ మరియు విద్యార్థిని,విద్యార్థులు యేసు ప్రభు,మరియమ్మ, గొల్లలు, గొర్ల కాపరులు లాంటి విభిన్న వేషధారణలో అందంగా  ముస్తాబై ఏసుప్రభు జననం మరియు ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతం సంబంధించి నాటక ప్రదర్శన ద్వారా తెలియపరిచారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మరియు సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఆరోన్ మరియు క్రిస్టియన్ సోదరులు హాజరై ప్రార్థన ద్వారా మరియు ఏసుక్రీస్తు జననం సంబంధించి క్లుప్తంగా వివరించారు...ప్రేమ, శాంతి, ఆనందాన్ని పరోపకారికి సహాయం చేయడం లాంటి విషయాలపై క్లుప్తంగా వివరించారు.. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.. దివ్యాంగులు అయినప్పటికీ యేసు ప్రభు వేషధారణతో పాటు నాటక ప్రదర్శనలు తిలకించిన అధికారులతో పాటు ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేశారు.

యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా, లోక రక్షకుడిగా జన్మించిన పవిత్ర దినంగా భావిస్తారని తెలిపారు. క్రిస్మస్ చెట్టు  ఏర్పాటు, నక్షత్రాలు ఇళ్లను దీపాలతో అలంకరించడం లాంటివి ఎందుకు చేస్తారో క్లుప్తంగా వివరించారు..ఈ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావాన్ని బోధిస్తుందన్నారు.

సెమీ క్రిస్మస్ వేడుకలను ముందుగా జరుపుకుంటారని తెలిపారు.. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించారు. 


ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల,ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల,ప్రిన్సిపాల్ రాజేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, చర్చి పాస్టర్ రెవరెండ్ ఆరోన్ కమిటీ సభ్యులు తాటి వీరేశం గుప్తా, బాబా గౌడ్ , చర్చ్ కమిటీ కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రణయ్ కుమార్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు..

Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >