Posted on 2025-12-22 11:14:30
దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేసిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ట్రాఫిక్ సిఐ ఎస్ఐ పై నగరానికి చెందిన ఓ తాగుబోతు తన వాహనాన్ని ఆపారంటూ పోలీసులపై దాడికి దిగిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. వాహనాల తనిఖీలో భాగంగా ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై పై దాడికి పాల్పడిన వ్యక్తిపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్ ప్రాంతానికి చెందిన పిట్ల సాయిలు అనే వ్యక్తి ట్రాఫిక్ పోలీసులపై విచక్షణారహితంగా దాడి జరిపారు. అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని చితకబాది సంబంధిత మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో పిట్ల సాయిలు పై కేసు నమోదు చేశారు. పోలీస్ విధులకు ఆటంకం కల్పిస్తూ, సిఐను తోసేసినట్లు కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. గత ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >