Posted on 2025-12-22 08:57:14
61 వాహనాలు స్వాధీనం..
అనుమానితులపై నిఘా!
డైలీ భారత్ న్యూస్, అన్నమయ్య జిల్లా/మదనపల్లె: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మదనపల్లె పట్టణంలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సోమవారం వేకువజామున పోలీసులు "కార్డన్ అండ్ సెర్చ్" నిర్వహించారు. మదనపల్లె డిఎస్పీ ఎస్. మహేంద్ర పర్యవేక్షణలో పట్టణంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
మదనపల్లె పట్టణ పరిధిలోని డక్నీ పేట, అగర్తలా వీధి, ఘోసియా వీధి, త్యాగరాయ వీధి మరియు బాడేమకాన్ ఏరియాల్లో పోలీసులు జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో 1వ పట్టణ సీఐ మహమ్మద్ రఫి, 2వ పట్టణ సీఐ రాజారెడ్డి, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సరైన పత్రాలు లేని మరియు అనుమానాస్పదంగా ఉన్న 61 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పాత నేరస్థులు, రౌడీ షీటర్లు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి, వారిని క్షుణ్ణంగా విచారించారు.
ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, "ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చేసేందుకే ఈ కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించాము. ముఖ్యంగా యువత చెడు మార్గాల్లో వెళ్లకుండా, అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా నిరంతరం నిఘా ఉంచుతాము. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు కలిగి ఉండాలి. అపరిచిత వ్యక్తులు లేదా అనుమానిత వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి" అని కోరారు
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >