Posted on 2025-12-22 12:59:57
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతదేశ గొప్ప గణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా “అకాడమిక్ మహోత్సవం” నిర్వహిస్తున్నారు. నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల ఫంక్షన్ హాల్ లో ఈ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో భాగంగా విద్యార్థుల మేధస్సు, నైపుణ్యాలను పెంపొందించేందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నోత్తరాల వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకతీయ విద్యాసంస్థల చైర్ పర్సన్ విజయ లక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్, రామోజీరావు, రాజా తేజస్విని హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ, కాకతీయ విద్యాసంస్థలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. జాతీయస్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే క్రీడలలో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, ప్రతి సంవత్సరం నిర్వహించే క్రీడోత్సవాలతో పాటు అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన సిలబస్ ఆధారంగా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అత్యాధునిక ఐఐటి సిలబస్ ఆధారంగా గణిత ప్రతిభను పరీక్షించేందుకు మ్యాథ్స్ రత్న, భాషా నైపుణ్యాలను వెలికితీయడానికి స్పెలతాన్, విద్యార్థులు తమ ఆలోచనలను క్రమబద్ధంగా వ్యక్తపరచేందుకు టెడ్ కాకతీయ, అన్ని సబ్జెక్టుల్లో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు క్విజతాన్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.
నిజామాబాద్ పట్టణంలో తొలిసారిగా ఈ తరహా అకాడమిక్ మహోత్సవం నిర్వహించడం గర్వకారణమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సుభాష్ నగర్ క్యాంపస్ బృందాన్ని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి పోటీలు నిర్వహిస్తూ విద్యార్థులను ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్న లెక్చరర్లు, ఉపాధ్యాయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల వివిధ ప్రిన్సిపాల్స్, నాన్ అకాడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు.
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >