| Daily భారత్
Logo




8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుగా విక్రయించిన కసాయపు తల్లిదండ్రులు..

News

Posted on 2025-12-20 13:50:53

Share: Share


8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుగా విక్రయించిన కసాయపు తల్లిదండ్రులు..

జిల్లా కేంద్రంలో గత పది రోజుల్లోనే ఇలాంటి వరుస ఘటనలు

వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:8 ఏళ్ల బాబును అంగట్లో సరుకుల కన్న తల్లిదండ్రులే విక్రయించిన ఘటన శనివారం జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. అయితే ఇలాంటి ఘటనే గత పది రోజులలో ఎల్లమ్మ గుట్ట ప్రాంతానికి చెందిన రెండు నెలల పసిబాబుని కన్నతల్లి హైదరాబాద్కు తీసుకువెళ్లి మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒకరికి విక్రయించేందుకు ప్రయత్నించినా ఘటన మరువకముందే అదే తరహా ఘటన జిల్లా కేంద్రంలో తాజాగా చోటుచేసుకుంది. అసలు జిల్లా కేంద్రంలో అనుమానం ప్రజల్లో కలుగుతుంది. తాజాగా శనివారం నవ  మాసాలు మోసి కని పెంచిన 8 సంవత్సరాల బాబుని విక్రయించారు ఓ తల్లిదండ్రులు. ఆర్థిక పరమైన ఇబ్బందులో లేక బాబు భారమయ్యాడో తెలియదు కానీ లక్ష రూపాయలకు  బాబుని అమ్మేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బాలల సంరక్షణ అధికారులకు తెలియడంతో వన్ టౌన్   పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దార్యాప్తు చేపట్టిన  పోలీసులు బాబును అమ్మేసిన తల్లిదండ్రులతో పాటు కొన్న వారిపై కేసు నమోదు చేశారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం బిక్షటన చేసుకుని జీవనం సాగించే తల్లిదండ్రులు తమ ఎనిమిది సంవత్సరాల బాబును లక్ష రూపాయలకు అమ్మేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఇరు వర్గాల పై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 8 సంవత్సరాల బాబుని కొన్నవారు  నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వారని తెలిసింది. ఇటీవలే నిజామాబాద్ నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాల బాబుని రెండు లక్షల నలభై వేల రూపాయలకు తండ్రికి తెలవకుండా  తల్లి అమ్మేసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన మరువకముందే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ లో  మరో సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపింది.

Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >