Posted on 2025-12-16 02:38:52
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బూరగడ్డ, లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం, ఓటర్లలో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు. పోలీస్ అధికారులు గ్రామ వీధుల గుండా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లోనుకావద్దని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్ బాబు సహా పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >