Posted on 2025-12-14 07:49:24
ఓటింగ్ సరళిని పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.
ఓటు వేయడానికి చలిని సైతం లెక్కచేయకుండా ముందుకు వచ్చిన వృద్దులు, యువత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఉదయం 7.00 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమయ్యింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి మోపాల్, ముల్లంగి, ధర్మారం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ తీరును, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల పరిశీలకులు శ్యాంప్రసాద్ లాల్ సైతం మోపాల్, మాక్లూర్, గుండారం తదితర పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 11 గంటల సమయానికి 49.13 శాతం పోలింగ్ నమోదయ్యిందని అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >
ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం
Posted On 2026-07-27 06:58:57
Readmore >
సదాశివనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించిన ఎల్లారెడ్డి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావు
Posted On 2026-07-26 16:55:36
Readmore >
బీబీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి – నలుగురిపై కేసు నమోదు
Posted On 2026-07-26 16:52:48
Readmore >