| Daily భారత్
Logo




మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా.. మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?

News

Posted on 2025-12-13 18:19:48

Share: Share


మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా.. మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?

సవాల్ విసిరిన బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా పదేళ్లపాటు పాలించిన పరిపాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సవాల్ విసిరారు. శనివారం నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాపై  తీవ్ర విమర్శలు చేశారు. తమ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ పై గణేష్ గుప్తా కొన్ని అవాస్తవ ఆరోపణలు చేసి తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారని అన్నారు. కేవలం జీవోలతో అభివృద్ధి జరగదని గణేష్ గుప్తా గుర్తించాలని హితావు పలికారు.

తమ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గారు వచ్చిన తర్వాత నిజామాబాద్‌కు రూ.130 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. కావాలంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పదేళ్ల గణేష్ గుప్తా  పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు.

మా నాయకుడు చేస్తున్న అభివృద్ధిని చూసి నేనే తెచ్చానని చెప్పుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. ఇకపై మా ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తే, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద ఆరోపణలు చేస్తుంది త్వరలోనే మాజీ ఎమ్మెల్యేల బాగోతం కూడా బయట పెట్టాలని అని కోరారు.  మాటల రాజకీయాలు చేస్తున్నారు తప్ప, ప్రజలకు చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని ప్రజాసమస్యలు, ఇప్పుడు రాజకీయ లాభం కోసం గుర్తుకు రావడం విచారకరం అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మాట్లాడే ముందు, తన పదవీకాలంలో చేసిన అభివృద్ధి పనుల లిస్టు బయట పెట్టాలి. కేంద్ర ప్రభుత్వ నిధులతో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం సరికాదు. నిజాం ప్రజలకు తెలుసు అన్నారు. జీవితంలో గణేష్ గుప్త తమ నేత అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తతో అభివృద్ధి విషయంలో పోల్చుకునే స్థాయి గణేష్ గుప్తకు లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా నిత్యం రోడ్లపై తిరుగుతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప తన పదేళ్ల కాలంలో ప్రజలకు ఏ ఒక్క మంచి చేయలేదని ఆయన అన్నారు. ఆయన హయాంలో నాణ్యతలేని స్ట్రీట్ లైట్లను నగరంలో అమర్చి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వాడుకో లేరా అని ప్రశ్నించారు. కేంద్రంతో కేంద్ర మంత్రులతో అమృత్ భారత్ కింద నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తేవడంతో పాటు, అసెంబ్లీలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలవలేరా అని గుర్తుకుతెచ్చారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ఆ అభివృద్ధిని తట్టుకోలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. పనుల్లో రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజమే, కానీ ప్రజల నమ్మకాన్ని మోసం చేయడం మాత్రం సరైంది కాదన్నారు.

మాటలతో కాదు, పనులతోనే నాయకత్వం కొలుస్తారు దానికి ఉదాహరణే తమ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అని ఇది ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. నగరంలో ఎటువంటి సమస్య వచ్చిన ముందు నిలబడే వ్యక్తి సూర్యనారాయణ గుప్తా అని అన్నారు. ఇంకోసారి అవస్థమైన ఆరోపణలు చేస్తే బుద్ది చేప్తామన్నారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు నాగోల్ల లక్ష్మి నారాయణ, న్యాలం రాజు. జిల్లా కార్యదర్శి జ్యోతి, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు ప్రమోద్ కుమార్, ఎర్రం సుదీర్,కార్యాలయ కార్యదర్శి బద్దం కిషన్, మండల అధ్యక్షులు తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్,కోడూరు నాగరాజ్, బీజేపీ నాయకులు పంచారెడ్డి శ్రీధర్, బూరుగుల వినోద్, మల్లేష్ గుప్తా, పుట్ట వీరేందర్, అమందు విజయ్ కృష్ణ, తెరల శ్రీధర్, భూపతి,సంతోష్, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరతలేదు

Posted On 2026-03-13 22:52:56

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్‌లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్

Posted On 2026-03-13 19:19:09

Readmore >
Image 1

పదవ తరగతి వార్షిక పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు

Posted On 2026-03-13 19:10:41

Readmore >
Image 1

ఏసీబీ కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Posted On 2026-03-13 18:06:25

Readmore >
Image 1

రోడ్డు నియమ నిబంధనలు పాటించాలి : ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Posted On 2026-03-13 17:42:24

Readmore >
Image 1

ఎల్.పి.జి గ్యాస్ కొరత లేదు : కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

Posted On 2026-03-13 17:35:18

Readmore >
Image 1

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

Posted On 2026-03-13 17:33:46

Readmore >
Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >