డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : షాబాద్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ధి గుండాల అశోక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామెన భీమ్ భారత్ కోరారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శుక్రవారం షాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుండాల అశోక్ ప్రచార సభలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గుండాల అశోక్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు కోరారు.పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని,పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తే భవిష్యత్ లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని అన్నారు. రాజకీయ, సామాజిక సమీకరణాల్లో భాగంగా అవకాశం దక్కని ఆశావాహులు ఎవరు కూడా నిరాశపడవద్దని. రాబోయే రోజుల్లో వారికి మంచి అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చల్లా మాధవరెడ్డి,తమ్మలి రవీంద్ర,దండు రాహుల్ గుప్త, గంధం గౌరిశ్వర్,అక్తర్ పాషా, ఎర్రోళ్ల మహేంద్ర గౌడ్,తౌసిఫ్,వార్డు అభ్యర్ధులు,గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
News
గుండాల అశోక్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి : చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి భీమ్ భారత్