Posted on 2025-12-12 17:15:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి సాయినాథ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ ప్రత్యేక మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వేషన్ దగ్గర నివాసముండే సాయినాథ్ కు పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం ఉండేవాడు.అతని మరదలుపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని మనసులో అనుకుని, ఆమె పని చేస్తున్న ప్రదేశంలోకి 29 నవంబర్, 2019 న బైక్ పైన తీసుకెళ్లి భూమారెడ్డి కన్వేషన్ దగ్గర ఉన్న తన ఇంటిలోకి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడనే నేర అభియోగాలు రుజువు అయినట్లు నిర్దారణ కావడంతో సాయినాథ్ కు అత్యాచారం నేరంకుగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జైలిశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >