Posted on 2025-12-09 15:35:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రోడ్డుపై ప్రమాదకరమైన గుంత ఏర్పడి తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పాలకులు పట్టించుకోకపోవడంతో యువకులు మానవత్వంతో ముందుకు వచ్చారు. మాజీ మంత్రి, ప్రస్తుతం ఇటీవలే ప్రభుత్వ సలహాదారునిగా నియామకమైన సుదర్శన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఈ సంఘటన వెలుగు చూడడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది.
బాసర నుండి నవీపేట్ ప్రధాన రహదారి మూలమలుపు వద్ద రోడ్డుమీద ఒక గుంత ఏర్పడి నెలలు గడుస్తున్న ఎవరూ పట్టించుకోలేదు. పాలకుల నిర్లక్ష్యంతో ఆ గుంత మరింత ప్రమాదకరంగా మారింది. శివ తాండకు చెందిన భానోత్ మోహన్ ఆ గుంతలో పడగా అతని కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే రోడ్డు మీద ఎంతోమంది ప్రయాణం చేస్తుంటారు. కానీ ఆ గుంత గురించి ఎవరు పట్టించుకోకపోవడంతో నవీపేట్ మండలం శివతాండకు చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తాండకు చెందిన ప్రతి యువకుడు పైసా పైసా జమచేసి గుంతను పూడ్చడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా గుంతను పూడ్చిన వారిలో శివతాండ యువకులు భాను,జీవన్ నాయక్, ప్రేమ్ సింగ్, మహేష్, తిరుపతి, ఉదయ్ లతో సహా ఇతర మిత్ర బృంద సహచరులు తదితరులు ఉన్నారు.
సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన ఆర్ముడ్ రిజర్వ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, గంగారాజు
Posted On 2025-12-09 12:48:45
Readmore >
రిజిష్టర్ కాని భూమి కొనుగోలు - పట్టా పాసుపుస్తకం పొందాలంటే?
Posted On 2025-12-09 11:22:22
Readmore >
సర్పంచ్ ఎన్నికల్లో సోషల్ మీడియాతో ముందుకు పోతున్న అభ్యర్ధులు
Posted On 2025-12-09 11:21:25
Readmore >
నకిలీ బంగారం అమ్ముతున్న ముఠా ను అరెస్టు చేసిన సూర్యాపేట రూరల్ పోలీసులు
Posted On 2025-12-09 08:11:59
Readmore >
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >