| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి

కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి

అభివృద్ధికి సంక్షేమానికి BRS పెద్దపీట

గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాపు సీతాలక్ష్మి

డైలీ భారత్ న్యూ,స్ భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. మంగళవారం చుంచుపల్లి మండలం ప్రశాంతినగర్ గ్రామపంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు గెలుపు కోసం మేషన్ కాలనీ, ఎస్సీబీ నగర్ ప్రాంత ఓటర్లను అభ్యర్థించారు. తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడ మైదానాలు, పల్లె దవాఖాన, వైకుంఠధామం, స్వచ్ఛ ట్రాక్టర్ ఏర్పాటు చేశారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లద్వారా తాగునీరు అందించారని తెలిపారు. రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2 వేలకు పెంచిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలియజేశారు. ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, బిడ్డ పుడితే కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు అందించి సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్ణచందర్, మద్దెల సుధీర్, షణ్ముఖ సాయి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous ప్రమాదకరమైన గుంతను మానవత్వంతో పూడ్చిన యువకులు
Next ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
ADVERTISEMENT