Posted on 2025-12-06 15:47:25
బీజేపీ జిల్లా అధ్యక్షులు,దినేష్ పటేల్ కులాచారి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: అవినీతి, నిర్లక్ష్యం ఇదే కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలన అని అని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పటేల్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. బీజేపీ జిల్లా కార్యాలయం లో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ విఫల పాలనపై మండిపడి, ప్రజలకు నిజాలు తెలియచేస్తాం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి… కానీ నామమాత్రంగా కూడా అభివృద్ధి కనిపించడం లేదు. మోసాలు, అవినీతి, నిర్లక్ష్యం మాత్రమే పెరిగాయి" అని ఆరోపించారు.
జిల్లాలో అభివృద్ధి శూన్యం అన్నారు బోధన్ షుగర్ ఫ్యాక్టరీకు ఎటువంటి పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.సారంగాపూర్ ఫ్యాక్టరీ పూర్తిగా పాడైపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.తెలంగాణ యూనివర్సిటీకి ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదు.
ఇది అభివృద్ధి కాదు… జిల్లావారిని మోసం చేసే పాలన" అన్నారు.
విమానాశ్రయం విషయంలో కాంగ్రెస్ నేతల తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు మన నిజామాబాదుకు ఎయిర్‌పోర్ట్ విషయం మాట్లాడకుండా ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ ఇస్తే వెళ్లి సీఎంకు సన్మానం చేసిన జిల్లా కాంగ్రెస్ నేతలు సిగ్గు పడాలి" అని ఆయన ధ్వజమెత్తారు.
"జిల్లా ప్రయోజనాలు పక్కనబెట్టి, అధికారపక్షం మురికి రాజకీయాలకు నమస్కారం చేసే వాళ్లను ప్రజలు చూడటం లేదు" అన్నారు.గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే
ఇప్పటి గ్రామాల్లో కనిపిస్తున్న లైటింగ్ నుంచి రోడ్‌ల వరకు… ప్రతి చిన్న అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వం పంపిన నిధులతోనే జరుగుతోంది. గ్రామీణాభివృద్ధి అంటే కేంద్రం—రాష్ట్రం వాటా దాదాపు కనబడడం లేదు" అని అన్నారు.
గ్రామాల బడ్జెట్, స్మార్ట్ స్ట్రీట్‌లైట్స్, పి.ఎం గ్రామ సడక్ యోజన, జల జీవన్ మిషన్—ఈ ప్రతిదీ కేంద్ర ప్రభుత్వమే నడిపిస్తున్నది" రేషన్ బియ్యం కేంద్రం ఇస్తుంది అన్నారు. అని ఆయన వివరించారు
నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
ధర్మానికి కట్టుబడి, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే సర్పంచ్ అభ్యర్థులను మీరు గెలిపించాలి. ఆ వ్యక్తులే మీ గ్రామానికి అభివృద్ధి తెస్తారు. పార్టీ కంటే ప్రజల సేవ ముఖ్యమని భావించే నాయకుల్ని ముందుకు తేవాలి" అన్నారు.
జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల్లో గెలిచిన, ఓడిపోయిన నాయకులు అవినీతిలో మాత్రం ముందున్నారు. నియోజకవర్గ అభివృద్ధి మీద శ్రద్ధ ఏమాత్రం లేదుగాని, అక్రమాల మీద మాత్రం 24 గంటలూ వ్యూహాలు వేసుకుంటున్నారు" అని ఆయన విమర్శించారు. గత 2 సంవత్సరాల పాలనా లో ఇందూరు జిల్లాకు అన్యాయం జరిగింది అభివృద్ధి శూన్యం అని అన్నారు. ఈ సమావేశం లో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ,దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజి,కార్పొరేటర్లు ప్రమోద్, మాస్టర్ శంకర్,జిల్లా కార్యదర్శి జ్యోతి,మండల అధ్యక్షులు తారక్ వేణు, ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు, బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ గుప్తా,పంచారెడ్డి శ్రీధర్, బూరుగుల వినోద్, యాదల నరేష్, అమందు విజయ్ కృష్ణ,తెరల శ్రీధర్, భూపతి, హరీష్,ఆనంద్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >