Posted on 2025-12-06 15:34:05
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై గట్టి నిఘా కొనసాగుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండగా చంద్రుగొండ పోలీసు వారు పట్టుకున్నారు. చంద్రుగొండ పోలీసు వారు వాహన తనిఖీలలో భాగంగా తనిఖీ చేస్తుండగా గూడ్స్ క్యారియర్ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన 280 క్వింటాళ్లు రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం విలువ రూ. 5,60,000/-. వాహన డ్రైవర్ అరుణ్ కుమార్ రాజ్‌బార్ విచారణలో, రేషన్ బియ్యాన్ని తక్కువ ధరలకు ఆంధ్ర మరియు తదితర ప్రాంతాలలో కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అధిక ధరలకు అమ్మే అక్రమ వ్యవస్థలో తాము భాగస్వాములమని, ఇందులో లారీ యొక్క యజమాని మరియు మరికొందరు వ్యక్తులు కూడా ఉన్నారని పోలీసులకు ఒప్పుకున్నాడు.
పోలీసులు అశోక్ లేలాండ్ లారీ CG 17 KZ 8355, 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం మరియు మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి ఈరోజు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించారు.ఈ ఆపరేషన్ మొత్తం కొత్తగూడెం డి.ఎస్.పి అబ్దుల్ రెహమాన్ మార్గదర్శకత్వంలో మరియు జూలూరుపాడు సి.ఐ శ్రీలక్ష్మి పర్యవేక్షణలో చంద్రుగొండ పోలీస్ వారు సమర్థవంతంగా నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయానికి సంబంధించి ఎటువంటి వ్యక్తులైనా కఠిన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో చుండ్రుగొండ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >