Posted on 2025-12-06 08:08:24
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: విద్యాలయ నిర్మాణానికి మేము సైతం అంటూ నాట్కో పరిశ్రమ ముందుకు వచ్చి గొప్ప ఔదార్యాన్ని చాటుకుంది. ఎమ్మెల్యే సంకల్పానికి మద్దత్తుగా భారీ విరాళాన్ని ఇచ్చింది. షాద్ నగర్ పట్టణంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి శుక్రవారం నాట్కో పరిశ్రమ యజమాన్యం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రూ 50 లక్షల చెక్కును అందజేశారు. పరిశ్రమ ప్రతినిధులు లక్ష్మీనారాయణ, మేనేజర్ సత్యనారాయణ లు ఎమ్మెల్యేకు చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా కళాశాల భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే వారికి చూపించారు.అనంతరం నాట్కో పరిశ్రమ ప్రతినిధులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ ఎంతో గొప్ప ఉద్దేశంతో ఈ ప్రాంత నిరుపేద విద్యార్థులకు సకల సదుపాయాలతో నిర్మిస్తున్న కళాశాల భవన నిర్మాణానికి విరాళాన్ని ఇచ్చినట్టు నాట్కో పరిశ్రమ ప్రతినిధులు లక్ష్మీనారాయణ సత్యనారాయణలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అగ్గనూర్ బస్వం, చెంది తిరుపతి రెడ్డి, సాయి కృష్ణ, మహ్మద్ ఇబ్రహీం, ఇసాక్, శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ రెడ్డి, ముబారక్ అలీ ఖాన్, సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >