Posted on 2025-11-25 14:32:35
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రం కేజిఆర్ గార్డెన్ లో "ఇందిరా మహిళ శక్తి సంబరాలు–2025" చేవెళ్ల,శంకరపల్లి ,షాబాద్ ,మొయినాబాద్ మండలలకు చందిన 3245 మహిళా సంఘాలుకు 3 కోట్ల 69 లక్షల 21 వేలు 7 వందల 62 రూపాయిలు మహిళలకు వడ్డీ లేని రుణాలను ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలే కేంద్రంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళలు వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకొని గొప్ప వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల ఆర్థిక ప్రగతి కోసం ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలలో వడ్డీ లేని రుణాలు ఒకటి అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ , గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్ కావాలి చంద్రశేఖర్, మార్కెట్ ఛైర్మెన్ పెంటయ్య గౌడ్, సురేందర్ రెడ్డి , మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు కోట లక్ష్మీ,మాజీ జేపీటీసీ కాలే శ్రీకాంత్ , చైర్మన్ ప్రతాప్ రెడ్డి , వెంకట్ రెడ్డి,సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, వీరేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి , కృష్ణ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ,నాలుగు మండలాల ఏపీఎంలు ,మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు, పార్టీ నాయకులు, డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు...
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >