| Daily భారత్
Logo




అందులను ఎట్టి పరిస్థితుల్లో చులకన భావంతో చూడకూడదు : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

News

Posted on 2025-11-23 13:58:54

Share: Share


అందులను ఎట్టి పరిస్థితుల్లో చులకన భావంతో చూడకూడదు : అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

సరైన శిక్షణ ఇస్తే సాధారణ మనుషులకంటేఎక్కువగా ప్రయోజకులవుతారు

స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ అందుల వసతి గృహం ప్రారంభోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పుట్టడంతోనే అంధులుగా విధి వక్రీకరించి జన్మించిన వారిని చూసి సమాజం చులకన భావంతో చూస్తారని మొదటగా అందుల పట్ల ఆ భావాన్ని తీసివేస్తే వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయవచ్చు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. ఆదివారం నగర శివారులోని ముబారక్ నగర్ పరిధిలోని తారకరామా నగర్ కాలనీలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రత్యేకంగా అంధ విద్యార్థుల కోసం నూతనంగా నిర్మించిన వసతి గృహాన్ని ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, సొసైటీ కార్యదర్శి సిద్దయ్యలు నూతన హాస్టల్ వసతి గృహప్రవేశం సందర్భంగా యజ్ఞ హోమ కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ మానసిక దివ్యంగా అంద విద్యార్థులకు ప్రత్యేక విద్యను అందిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీస్తున్న సిద్దయ్య వారి సిబ్బందికి అభినందనలు తెలిపారు. మానసిక దివ్యాంగ, అంత విద్యార్థుల పట్ల ఎవరు కూడా హేళన చేయకూడదని అవసరమైతే, కుదిరితే వారికి ప్రేమను పెంచాలే తప్ప వారిలో ఉన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయవొద్దని ఆయన కోరారు. ఎమ్మెల్యేగా తన వంతు మానసిక దివ్యంగా విద్యార్థులకు స్నేహ సొసైటీ లో చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక నిధులు తీసుకురావడమే కాకుండా, తమ సొంత ట్రస్టు ద్వారా ఏదైనా సాయం కోరితే తప్పకుండా నెరవేరుస్తానని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ముక్క దేవేందర్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు శాలువాతో  ఘనంగా సత్కరించారు.


Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >