| Daily భారత్
Logo




నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-11-23 13:56:42

Share: Share


నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో ఆదివారం డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరం రోజురోజుకి తెలంగాణలోని అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నెంబర్ వన్ గా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు ఏ చిన్న ఫర్నిచర్ అవసరం ఉన్న హైదరాబాద్, ఇతర మహా నగరాలకు వెళ్లి ఖరీదు చేసుకొని రావాల్సి ఉండేదని ఆయన అన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా నిజామాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని నగరంలో డిఏ ఫర్నిచర్ షోరూమ్ ని స్థాపించిన యాజమాన్యం సాయ రెడ్డి, స్వప్న అనే  దంపతులు నిజామాబాద్ లాంటి నగరాల్లో అత్యాధునిక టెక్నాలజీ తో కూడిన ఫర్నిచర్ షోరూమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా మాట్లాడుతూ నగరంలో ఆదివారం రోజు ఆరవ బ్రాంచ్ ను స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. తక్కువ బడ్జెట్ తో నాణ్యమైన, మన్నికైన ఫర్నిచర్ అందించడం తమ ప్రత్యేకత అని అన్నారు. ఏ ఫర్నిచర్ షాపుల్లో లభించని విధంగా తమ షాపులో తక్కువ ధరకు అన్ని రకాల ఫర్నిచర్ లను కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు. తమ షోరూమ్ కు వచ్చి జిల్లా ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.


కార్యక్రమంలో జడ్పిటిసి ఫోరం రాష్ట్ర కార్యదర్శి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >