| Daily భారత్
Logo




బీసీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

News

Posted on 2025-11-23 12:25:35

Share: Share


బీసీల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సంజయ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు  తెచ్చుకోవాలి

ప్రభుత్వ సలహాదారులు తెచ్చుకోవాలిసుదర్శన్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ వెల్లడి

నా రాజకీయ గురువు డి. శ్రీనివాస్

ఆయన ద్వారానే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకున్నాను..

పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు

అట్ట హాసంగా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుని బాధ్యతలు స్వీకరించిన మాజీ మేయర్ సంజయ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు నూతన అధ్యక్షునిగా నియామకమైన మాజీ మేయర్ ప్రస్తుత మున్నూరుకాపు జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ ప్రమాణస్వీకారం అంగరంగ వైభవంగా అతిరథ మహారధుర నడుమ ఆదివారం జిల్లా కేంద్రంలోని మున్నూరు కాపు సంఘంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు పాల్గొన్నారు. అదేవిధంగా టిపిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ శిష్యుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు సరైన గౌరవం దక్కుతుందని వారు అన్నారు. అలాగే మాజీ మేయర్ సంజయ్ అటు మున్నూరు కాపుల ఐక్యతను చూస్తూనే, తనకున్న రాజకీయ అనుభవంతో ఇకపై జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయాలని వారు కోరారు. కష్టపడ్డ వారికి నిజాయితీతో ఉన్నవారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ద్రోహం చేయదని అన్నారు. ఇందూరు అంటేనే డిఎస్ గా అపార రాజకీయ అనుభవం కలిగిన సంజయ్ తండ్రి పెద్దవారు డి శ్రీనివాస్ అడుగుజాడల లో నడవడం అభినందనీయం అన్నారు. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో సంజయ్ కాంగ్రెస్ పార్టీ తరపున చురుకైన పాత్ర పోషించాలని వారు అన్నారు. అనంతరం టిపిసిసి చీఫ్  తన రాజకీయ గురువు అప్పటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ అని, ఆయనే తనకు రాజకీయ ఓనమాలు నేర్పారని  అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా  మున్నూరు కాపు సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >