Posted on 2025-11-22 10:13:30
20 లక్షల నగదు, 17 తులాల బంగారం,కిలో వెండి అపహరణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని ఓ బ్యూటీపార్లర్కు వచ్చే మహిళ ఆ బిల్డింగ్ యజమాని ఇంటికే కన్నం వేసి భారీ చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వన్ టౌన్ పోలీస్టేషన్ ఎహెచ్త్వో రఘుపతి తెలిపిన కథనం ప్రకారం.. నగరంలోని కుమార్ గల్లీకి చెందిన గంగాకిషన్ తన భవనంలోని ఉన్న ఒక షట్టర్ను మూడేండ్ల క్రితం బ్యూటీపార్లర్ నిర్వహ ణకు అద్దెకు ఇచ్చారు. పార్లర్ యజమానురాలి అక్క వినాయకనగర్ కు చెందిన గాయత్రి సైతం రోజూ బ్యూటీపార్లర్ కు వచ్చేది. ఈ క్రమంలో ఇంటి యజమానులతో గాయత్రి సన్నిహితంగా ఉంటూ తరుగుతూ వారి ఇంట్లోకి వెళ్లేది. నగరంలోని గాయత్రి వారి ఇంటి డోర్ తాళం చెవి ని చోరీ చేసింది. యజమానులు ఇంట్లో లేని సమయంలో తన వద్ద ఉన్న తాళం చెవితో చొరబడి బీరువాలో ఉన్న బంగారు నగలు, వెండి, నగదు చోరీ చేసింది. చాలా రోజుల తర్వాత ఇంటి యజమానులు తమ బీరువా లోని బంగారం, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి శుక్రవారం వన్ టౌన్ పోలీ సులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బీరువాలో నుంచి సుమారు రూ.20 లక్షల నగదు, 17 తులాల వరకు బంగారు నగలు, కిలో పావు వెండి వస్తువులు చోరీకి గురైనట్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్హెచ్ఓ తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >