| Daily భారత్
Logo




18 శాతం బీ సీ రిజర్వేషన్ లతో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి

News

Posted on 2025-11-22 08:17:42

Share: Share


18 శాతం బీ సీ రిజర్వేషన్ లతో స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణను ప్రభుత్వం తక్షణమే నిలిపివేయాలి

డిసెంబర్ 09 న బీసీ తిరుగుబాటు మహా సభ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: 18 శాతం బీసీ రిజర్వేషన్లతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న స్థానిక సంస్థల కార్యాచరణను వెంటనే నిలిపివేసి ఇచ్చిన హామీ మేరకు 42 శాతం కేంద్ర, న్యాయ అనుమతి వచ్చేవరకు ఎన్నికలు రాష్ట్రంలో నిర్వహించోద్దని డిమాండ్ తో డిసెంబర్ 9న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ మైదానంలో నిర్వహిస్తున్నామని తెలంగాణ బ్యాక్వర్డ్  రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన తమ బీసీ సంఘం నేత దోసపూడి నరహరి నేతృత్వంలో 16 మందితో అదే విధంగా సీనియర్ నాయకుడు భాష 16 మందితో అదే విధంగా సీనియర్ నాయకుడు భాస రాజేశ్వర్ నేతృత్వంలో సలహామండిలిని ఏర్పాటు చేశామని, ఆహ్వాన సంఘం వివరాలను ఆయన వెల్లడించారు. ఇది కేవలం ప్రాథమిక కమిటీ మాత్రమేనని త్వరలో నగర, రూరల్, నియోజకవర్గ కమిటీలను, కుల సంఘాలతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఆ కమిటీలు జిల్లా, సమీప జిల్లాలో విస్తృతంగా పర్యటించి, గ్రామ కుల సంఘాలతో ఇక్కడ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆ కమిటీలు జిల్లా, సమీప జిల్లాలో విస్తృతంగా పర్యటించి గ్రామ కుల సంఘాల ప్రజాసంఘాలను కలుపుకొని చైతన్య సదస్సులను ఏర్పాటు చేసి డిసెంబర్ 9న జరిగే మహాసభను విజయవంతం చేసే దిశగా కార్యాచరణను రూపొందించుకుంటారని ఆయన తెలిపారు. ఈ చైతన్య సభలో రాష్ట్ర ప్రభుత్వం తమ హామీలను నిలబెట్టుకోవడంలో రెండు సంవత్సరాలుగా చేసిన కాలయాపనను ఎగరగొట్టడానికి చేసిన కుట్రను వివరిస్తారని ఆయన తెలిపారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలను అవగాహనతో చేసిన మోసాన్ని వివరిస్తారని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో కోకన్వీనర్లు కొండవీటి శ్యాం ప్రసాద్, గుట్టు గంగాధర్, హనుమంతరావు, నాగన్న, అంబదాస్, పృధ్విరాజ్, రేంజర్ల సురేష్ ( అడ్వకేట్) తదితరులు పాల్గొన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >