| Daily భారత్
Logo




బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

News

Posted on 2025-11-20 14:55:31

Share: Share


బీఎంబీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం లో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

మోసపూరిత ప్రకటనలకు ప్రజలు ఆకర్షితులై మోసపోకూడదు

పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి ప్రజలకు సూచన

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మల్టీ లెవెల్ గురువారం రెండు గంటల సమయంలో ఫిర్యాది అయిన తోకల బక్కన్న పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన దరఖాస్తు ఏమనగా అతను అక్టోబర్ 13వ తారీఖున కోటగల్లీలోని కెనరా బ్యాంకు పక్కకు ఉన్నటువంటి బిఎంబి కంపెనీ  చూసి అక్కడికి వెళ్ళగా నిందితుడైన చంద్రశేఖర ప్రసాద్ నన్ను పిలువగా ఫిర్యాది అతనిని కలిసి అతని ద్వారా మల్టీ లెవెల్ మార్కెటింగ్ చైన్ సిస్టం అయినటువంటి బీఎంబీ కంపెనీ గురించి తెలుసుకొని అది ఇంగ్లాండు దేశంకు చెందినదని, దాంట్లో పెట్టుబడి పెట్టి కంపెనీ యాడ్స్ కి రేటింగ్ ఇవ్వడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందవచ్చని, అలాగే వివిధ రకాలైన గృహ ఉపకరణాలు మరియు సెల్ ఫోన్లు కూడా పొందవచ్చునని నిందితుడు అమాయక ప్రజల నుండి మోసం చేసినట్లు సిపి సాయి చైతన్య వివరించారు. గురువారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుని మోసపూరిత మాటల ద్వారా నమ్మించగా ఫిర్యాదుదారుడు నిందితుడైన చంద్రశేఖర ప్రసాద్ మాటలు నమ్మి, నిందితుడు పంపిన లింకు ద్వారా తన ఫోన్లో బీఎంబీ కంపెనీకి సంబంధించిన ఆప్ ను ఇన్స్టాల్ చేసుకుని అందులో జాయిన్ అయి, సుమారు రూ : 84,398 రూపాయలను వేరువేరు వేరువేరు లెవెల్స్ లలో విడుదల వారీగా, నిందితుడు ఫోన్లో పంపినటువంటి లింకుల ద్వారా, కంపెనీ యాప్ నందు ఫోన్పే ద్వారా నిందితుడు పంపినటువంటి లింకులలో పెట్టుబడి పెట్టి నిందితుడు చెప్పిన మాయ మాటలకు ఆకర్షితుడై తన రక్తసంబంధీకుల తరఫున తనకు తెలిసిన వారి తరఫున కూడా కొంత మొత్తంలో నగదును కంపెనీ ఆప్ యందు పెట్టుబడి పెట్టి, అతని కంపెనీ వాలెట్ అకౌంట్ యందు జమ అయినటువంటి ఫేక్ ఎమౌంటును విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా, అమౌంట్ విత్డ్రా కాలేదని తాను మోసపోయానని తెలుసుకొని, పోలీస్ స్టేషన్ నందు దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందన్నారు. కేసులో ప్రధాన నిందితుడు ఈ విధంగా సుమారు 22 మందిని మోసం చేసినట్లు తెలిసింది. ఇట్టి బిఎంబి కంపెనీ పెట్టుబడులు పెట్టి సుమారు 750 మంది వరకు మోసపోయినట్లుగా తెలిసిందని ఆయన వివరించారు.  బాధితులు ఇట్టి బిఎంబి కంపెనీ లో పెట్టుబడి పెట్టినటువంటి డబ్బుల విలువ సుమారు కోటి నుండి కోటిన్నర వరకు కలదన్నారు. ప్రస్తుతం ఇట్టి బీఎంబీ కంపెనీకి చెందినటువంటి యాప్ పనిచేయటం లేదు. కంపెనీ పంపిన లింకులన్నీ కూడా చైనా బేస్డ్ లింకులని ఆ లింకుల ద్వారా పంపినటువంటి కోటి నుండి కోటినర రూపాయలు చైనా బేస్డ్ లింకులకు డైవర్ట్ అయినట్లు సమాచారం అందినట్లు, ఈ సందర్భంగా ప్రజలు ఎవ్వరు కూడా ఇలాంటి మోసపూరితమైనటువంటి మల్టీ లెవెలింగ్ మార్కెటింగ్ చైన్ సిస్టం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలను పొందాలని ఉద్దేశంతో పెట్టుబడులు పెట్టకుండా మోసపోకూడదని సూచించారు. ఇలాంటి ఎరవేసి మభ్యపెట్టి మోసపూరిత మాటలు చెప్పి ఆకర్షణ చేసేటువంటి వ్యక్తుల గురించి తమ ఏరియాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించి, దరఖాస్తు ఇవ్వాలని ఆయన కోరారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >