| Daily భారత్
Logo




హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు

News

Posted on 2025-11-19 13:06:07

Share: Share


హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్‌ను గుజరాత్‌ జైల్లో చితకబాదిన తోటి ఖైదీలు

డైలీ భారత్ న్యూస్, గుజరాత్:గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి కీలక వార్తలు వెలువడ్డాయి. రిసిన్ పాయిజన్‌తో ప్రజలను హత్య చేయడానికి కుట్ర పన్నిన హైదరాబాద్‌కి చెందిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ను తోటి ఖైదీలు చితకబాదారు.

జైలు శిక్ష అనుభవిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP)తో సంబంధం ఉన్న ఉగ్రవాది డాక్టర్ అహ్మద్‌పై జైలు లోపల దాడి జరిగింది. హై సెక్యూరిటీ సెల్‌లో బంధించినప్పటికీ ఇతర ఖైదీలు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

దాడి సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని, అతడి ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని వర్గాలు తెలిపాయి. సెల్ వెలుపల ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే లోపలికి వెళ్లి డాక్టర్ అహ్మద్‌ను ఖైదీల బారి నుంచి రక్షించింది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)కు చెందిన ఓ బృందం సబర్మతి జైలుకు చేరుకుని, దాడి ఎందుకు జరిగిందని దర్యాప్తు ప్రారంభించింది. ఖైదీలు ఎందుకు ఆకస్మిక దాడికి పాల్పడ్డారో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ఎవరు?

నవంబర్ 8న, గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ ముగ్గురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతడు ఐసీస్‌కు చెందిన ఓ ప్రాంతీయ విభాగం.. ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ)కు చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్‌తో టచ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చైనాలో ఎంబీబీఎస్ చదవిని మొహియుద్దీన్ ఆముదం గింజల నుంచి ప్రమాదకరమైన రైసిన్ అనే విషాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అహ్మదాబాద్ ఏటీఎస్ వీరిని విచారిస్తోంది. ఈక్రమంలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. మొహియుద్దీన్.. ఐఎస్‌కేపీకి చెందిన ఉగ్రవాది అబూ ఖాదీమ్ ఆదేశాల మేరకు పని చేస్తుండేవాడని విచారణలో వెల్లడైంది. సదరు ఉగ్రవాది.. పాక్‌-అఫ్గాన్‌ సరిహద్దుల్లో ఉండి ఈ మాడ్యూల్‌ను నడిపిస్తున్నాడని.. అతడే మొహియుద్దీన్‌కు అవసరమైన సమాచారం కూడా అందించేవాడని తెలిసింది.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >