Posted on 2025-11-18 12:14:11
బిజెపి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అర్బన్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధి గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలపడేది కార్యకర్తల అంకితభావం ద్వారానే అని చెప్పారు. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ కమిటీలను బలోపేతం, చేయాలని సూచించారు. కార్యక్రమంలో పోతంకర్ లక్ష్మి నారాయణ గారు, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు, బీజేపీ జిల్లా సెక్రటరీ జోతి, జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ పుట్ట వీరేందర్, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, ఆనంద్ రావు, ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు, కోడూరు నాగరాజు, భూపతి అన్ని డివిజన్ల ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >