| Daily భారత్
Logo




మేరా యువ బారత్ ఆధ్వర్యంలో సర్దార్ @150 యూనిటీ మార్చ్

News

Posted on 2025-11-18 12:07:15

Share: Share


మేరా యువ బారత్ ఆధ్వర్యంలో సర్దార్ @150 యూనిటీ మార్చ్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: "ఏక్ బారత్ - ఆత్మనిర్భార్ భారత్ " సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు సంవత్సరవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా   వర్ని చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు ఘనంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

ఈ ర్యాలీ వర్ని చౌరస్తా నుండి మొదలై ప్రధాన రహదారి గుండా నినాదాలు తో కొనసాగి పాత కలెక్టరేట్ భవన ప్రాంగణం లోని సభా ప్రాంగణo వరకు ముగిసింది.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేడు మనం దేశ నిర్మాణ శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంవత్సర వ్యాప్తంగా వారి 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని, వర్ని చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీ కోసం ఒకచోట చేరడం ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సర్దార్ పటేల్ మన స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు, స్వతంత్ర భారత నిర్మాణంలోనూ ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించిన మహానుభావుడు. దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలను ఒక్క తాటిపైకి తెచ్చి, భారతదేశాన్ని ఏకీకృతంగా నిర్మించడం ఆయన చేసిన అపూర్వ సాహసం. అందుకే ఆయనను “భారత ఐక్యతకు ప్రతీక”గా ప్రపంచం గుర్తిస్తుందన్నారు. మన యువత ఈ మహనీయుని ఆలోచనలను, ప్రేరణను తమ జీవితంలో కలుపుకోవాలి. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ఈరోజు మనందరికీ అత్యంత అవసరం అని అన్నారు.

మన సమాజంలో ఐక్యత, సమానత్వం, శాంతి, సోదరభావం పెంపొందించడంలో మీలో ప్రతి ఒక్కరి పాత్ర విలువైంది అని అన్నారు. ఈ ర్యాలీ ద్వారా మనం కేవలం సర్దార్ పటేల్ ని స్మరించుకోవడం మాత్రమే కాదని, అయన చూపిన మార్గాన్ని అనుసరించేందుకు ప్రజలకు సందేశం పంపుతున్నామన్నారు.

దేశం కోసం, సమాజం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనమందరం ఒకటై ముందుకు సాగాలని  ప్రతిజ్ణ చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి,మేరా యువ భారత్ జిల్లా అధికారి షైలా బెలాల్,మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, పోతంకర్ లక్ష్మీనారాయణ,బీజేపీ నాయకులు, విద్యార్థులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >