| Daily భారత్
Logo




సాహితీ వీరుడా.. అందుకో వందనం

News

Posted on 2025-11-10 13:24:14

Share: Share


సాహితీ వీరుడా.. అందుకో వందనం

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"

అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటు

"జయ జయహే తెలంగాణ" అంటూ అక్షరాలు రాసిన ఆ చెయ్యి లేదంటే నమ్మలేకపోతున్నా

అందెశ్రీకు తగిన గుర్తింపునిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అందెశ్రీ కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండదండగా ఉంటుంది

షాద్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందెశ్రీకి "ఘన నివాళి"

నివాళి అర్పించిన ఎమ్మెల్యే, తదితర కాంగ్రెస్ నాయకులు

డైలీ భారత్, హైదరాబాద్: జయ జయహే తెలంగాణ అంటూ అక్షరాలు రాసిన ఆ చేయి ఇప్పుడు లేదని తలుచుకుంటేనే ఎంతో బాధగా ఉంది.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన వంతు సహకారం అందించి నేటి వరకు సాహిత్య లోకానికి అక్షర రూపంలో అండగా నిలబడిన సరస్వతీ పుత్రుడు మరో నవ కాళిదాసు ప్రముఖ కవి, గాయకుడు అందెశ్రీ మరణం తెలంగాణ రాష్ట్రానికి, సాహిత్య లోకానికి తీరనిలోటని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ మరణంపై ఎమ్మెల్యే శంకర్ సోమవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితర నాయకులు అందెశ్రీ చిత్రపటానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతిక ఉద్యమంలో, కవిగా తన పాటలతో, సాహిత్యంతో, కీలక పాత్ర పోషించిన అందెశ్రీ మరణం తెలంగాణకు తీరనిలోటని అన్నారు. ఉద్యమ కాలంలో అందెశ్రీతో ఎంతోమంది కవులు కళాకారులు రాజకీయ నాయకులకు అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర ప్రభుత్వానీతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే శంకర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అందెశ్రీ మరణంతో శోకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అందెశ్రీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎమ్మెల్యే శంకర్ ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందెశ్రీకి తగిన గుర్తింపు గత ప్రభుత్వం ఇవ్వలేదని విచారణ వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యాక ఆయనను ఎంతో ఘనంగా సత్కరించి అన్ని విధాల ఆదుకున్నారని గుర్తు చేశారు. అధ్యక్షుడి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదేవిధంగా

అందెశ్రీ మరణంపై మరో కాంగ్రెస్ నాయకులు సీనియర్ నేత పి రఘునాయక్ మాట్లాడుతూ

స్పందించారు. ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అకాల మరణం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అందెశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. సినీ, సాహితీ ప్రస్థానం గురించి రఘునాయక్ వివరిస్తూ

గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా కూడా పని చేశారన్నారు. పాఠశాల చదువు లేకుండానే మేటి రచయితగా రాణించారనీ తన రచనలతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ" ఆయన రాసిందేనని "మాయమైపోతున్నడమ్మా" పాటతో ప్రజల్లో విశేషమైన పేరును సంపాదించుకున్నారనీ, ఆశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట అనీ సినీ రంగానికి సైతం ఆయన సేవలందించారనీ 2006లో "గంగ" సినిమాకు గాను అందెశ్రీకి నంది పురస్కారం లభించిందన్నారు. 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్నాయక్ పురస్కారంతోపాటు కాకతీయ యూనివర్సిటీ నుంచి అందెశ్రీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారనీ రఘునాయక్ వివరించారు. శ్రద్ధాంజలి ఘటించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, అగ్గనూరు బస్వం, ముబారక్ అలీ ఖాన్, చంద్రశేఖర్, గోదా మాధవులు, ముబారక్ అలీఖాన్, శ్రీను నాయక్, సయ్యద్ ఖదీర్, దిలీప్, చిన్న, మురళీమోహన్ అప్పి, జంగారి రవి తదితరులు పాల్గొన్నారు

Image 1

ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

Posted On 2026-05-27 16:58:02

Readmore >
Image 1

ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-27 16:43:06

Readmore >
Image 1

అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి ధాన్యం రక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-05-27 16:39:20

Readmore >
Image 1

కొనుగోళ్ళు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-27 16:35:33

Readmore >
Image 1

వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...

Posted On 2026-05-27 16:31:01

Readmore >
Image 1

వేం నరేందర్ రెడ్డితో భద్రాచలం కాంగ్రెస్ నాయకుల భేటీ....

Posted On 2026-05-27 13:54:00

Readmore >
Image 1

సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలి : మంద బాబు

Posted On 2026-05-27 13:53:04

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

Posted On 2026-05-27 09:32:36

Readmore >
Image 1

హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-26 10:43:36

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-05-26 08:13:24

Readmore >