| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం : హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను ప్రారంభించిన పోలీస్ కమిషనర్

డైలీ భారత్, ఖమ్మం: పోలీసు వాహనాల నిర్వహణను మెరుగుపరచడానికి, మరమ్మతులను వేగవంతం చేయడానికి  యంటి సెక్షన్‌ వర్క్ షాప్‌లో ఏర్పాటు చేసిన

హైడ్రాలిక్, ఎలక్ట్రో - మెకానికల్ వెహికల్ లిఫ్టర్‌ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారంభించారు. 

పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం రోడ్లపై తిరగడం వల్ల వచ్చే వాహన మరమ్మతుల కోసం మెకానిక్ వర్క్ షాప్ లలో గంటల తరబడి కాకుండా నిమిషాల్లో సిద్ధమయ్యే విధంగా వెహికల్ లిఫ్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని పోలీస్ కమిషనర్ తెలిపారు. దీనివల్ల పోలీస్ శాఖ వాహనాల జీవితకాలం పెరగడమే కాకుండా, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయన్నారు.


కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఏఆర్) కుమారస్వామి, ఏఆర్ ఏసీపీ లు సుశీల్ సింగ్, నర్సయ్య, ఆర్ ఐ లు కామరాజు, శ్రీశైలం, సురేష్, నాగుల్ మీరా పాల్గొన్నారు.

Previous ఇందిరా మహిళా శక్తి భవనాలను సభ్యులు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Next గ్రామ దీపికల సమస్యలను పరిష్కరించాలి
ADVERTISEMENT