| Daily భారత్
Logo




కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిట లాడిన శైవ క్షేత్రాలు

News

Posted on 2025-11-05 18:49:06

Share: Share


కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిట లాడిన శైవ క్షేత్రాలు

ఇంటి ముంగిళ్లలో తులిసమ్మ కోటలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సుహాసినిలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసాల్లో కార్తీకమాసం ప్రత్యేకమైనది గా చెప్పుకుంటారు శివుని భక్తులు. అది కార్తీక పౌర్ణమి రోజున  ఆ దేవదేవుని సన్నిధిలో  ఆ ఉసిరికాయలను వేద పండితులకు సమర్పిస్తే ఎంతో మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉదయం తెల్లవారుజామున నుండి మహిళా భక్తులు శైవ క్షేత్రాలకు చేరుకుని శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుండి ఆలయాలకు వచ్చిన భక్తులు రాత్రి వరకు కూడా భక్తుల రాక కొనసాగింది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రమైన శ్రీ నీలకంటేశ్వరాలయంలో మహిళా భక్తులు భక్తిశ్రద్ధలతో వివిధ దూర ప్రాంతాల నుంచి సైతం వచ్చి దీపాలను వెలిగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇంటి ముంగిళ్ళలో ఉండే తులసమ్మ కోటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉసిరికాయలతో దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు. చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి తమ ఇంటి ముంగిళ్లలో ఉన్న తులసికి ప్రత్యేక పూజలుఇంటి ముంగిళ్లలో ఉన్న తులసికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత అని భక్తులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల ఆ పరమేశ్వరుని ఆశీస్సులు తమ ఇంటిల్లిపాది పట్ల ఉండాలని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.


Image 1

సీతారామ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

Posted On 2026-05-25 19:54:35

Readmore >
Image 1

మహిళ సంఘ భవనం కోసం భూమి పూజ నిర్వహించిన సర్పంచ్

Posted On 2026-05-25 19:25:02

Readmore >
Image 1

మైనర్ బాలిక పై లైంగిక దాడికేసు లో జీవిత కాలం జైలు శిక్ష

Posted On 2026-05-25 19:19:35

Readmore >
Image 1

లైసెన్స్ సర్వేయర్లకు గౌరవ వేతనం ప్రకటించాలి

Posted On 2026-05-25 19:18:11

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

Posted On 2026-05-25 17:20:28

Readmore >
Image 1

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 17:15:49

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ ఈఈ

Posted On 2026-05-25 15:20:36

Readmore >
Image 1

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం

Posted On 2026-05-25 15:10:05

Readmore >
Image 1

అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-25 10:43:55

Readmore >
Image 1

నాలుగు జిల్లాలకు ఇన్చార్జిగా సిరికొండ సుదర్శన చారి

Posted On 2026-05-25 09:07:34

Readmore >