| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అమరవీరుల పోరాట స్ఫూర్తి ని కోనసాగిద్దాం

అమరవీరుల పోరాట స్ఫూర్తి ని కోనసాగిద్దాం

సిపిఐ (ఎం -ఎల్ )న్యూడెమోక్రసీ అమరవీరుల సంస్మరణ సభలో వక్తల పిలుపు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ  ఆద్వర్యంలో నిజామాబాదు జిల్లా కేంద్రంలోని నాగరంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు.

ముందుగా అమరవీరుల చిత్ర పటానికి పూల దండ వేసి నివాళులు అర్పించారు.

అనంతరం సిపిఐ (ఎం -ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహయకార్యదర్శి పుట్ట వరదయ్య మాట్లాడుతు భూమి కోసం, భుక్తికోసం,విముక్తి కోసం ఎంతో మంది వీరులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని అన్నారు.

దోపిడీ పీడన లేని సమసమాజం కోసం పోరాటం చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. దేశంలోని 

బడా బుర్జువా,భూస్వామ్య, పాలకవర్గ పార్టీలు కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు.

పేద ప్రజలకు భూములు పంచడం లేదని, కార్పోరేట్ వర్గాలకు వేలాది ఎకరాలు భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. దేశంలో పేదరికం, దారిద్ర్యం, నిరుద్యోగం, అవినీతి, అసమానతలు రోజు రోజుకు పెరుగుతున్నాయనిఆవేదన వ్యక్తం చేశారు.

పాలకులు ప్రజల మద్య విద్వేషాలు పెంచుతున్నారని అన్నారు.

ఈ దేశంలో సమాజ మార్పు కోసం జరిగిన పోరాటాలు నగ్జల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన పోరాటాలు అని అందులో ఎంతో మంది వీరులు అమరులైనారని గుర్తు చేశారు.

చండ్ర పుల్లారెడ్డి, నీలం రామచంద్రయ్య, రామనర్సయ్య లాంటి భారత విప్లవోధ్యమ అగ్ర నాయకుల స్ఫూర్తి తో పోరాటాలుఐఎఫ్టియు నిర్వహించాలని పిలుపు ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివరాజు, పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు సతీష్, మోజీరాం, వినోద్, లక్ష్మి, ఉదయ్ కుమార్, నరేష్, ప్రకాష్, తదితరులు పాల్గోన్నారు

Previous కనకగిరి గుట్టల ప్రకృతికి పరవశించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
Next తనను దొంగ కరెన్సీ నోట్ల కేసులో ఇరికించాలని కొందరు కుట్ర పన్నుతున్నారు
ADVERTISEMENT