Posted on 2025-11-05 09:43:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కార్తీక పౌర్ణమి సందర్భంగా బాల్కొండ మండలం లింబాద్రిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని బుధవారం జాగృతి అధ్యక్షురాలు కవితప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం స్థానిక మీడియా ప్రతినిధులతో కవిత మాట్లాడారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భీంగల్ మండలంలోని లింబాద్రి స్వామి ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుందన్నారు. చాలా పవర్ ఫుల్ దేవుడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చానని ఆమె అన్నారు. నిజానికి లింబాద్రి ఆలయం కాదు, నింబాద్రి. చాలా మహిమ గల దేవుడు అని ఆమె పేర్కొన్నారు. వేప చెట్లు ఉన్నాయని నింబాద్రి అంటారు. కాలక్రమేణా లింబాద్రిగా పేరు వచ్చిందన్నారు. ఈ దేవుడి దయ వల్ల నిజామాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి రాష్ట్రంలో కీలకమైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్నారు. ఈ మండలానికి సంబంధించి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారని తెలియజేశారు. మరో ముగ్గురు కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా ఈ ప్రాంతం వారే అని అన్నారు. ఇక్కడి ఎమ్మెల్యే ఎవరన్నది పక్కన పెడితే.. రూలింగ్ పార్టీదే నడుస్తోందన్నారు. అయినా సరే రైతులు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. మక్కలు 80 శాతం కొన్న తర్వాత ఇప్పుడు కాంటా పెడుతున్నారు. ఇది దారుణం, అన్యాయం అని మండిపడ్డారు. తడిసిన వరి కూడా కొంటలేరు. కొంటామని కూడా చెప్పటం లేదన్నారు. ఇటీవల తాను నిర్వహించిన జనంబాట కార్యక్రమంలో భాగంగా నవిపేట మండలం యంచ గ్రామానికి వెళ్లిన తర్వాత కలెక్టర్ ఆసందర్శించారని తెలిపారు ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు.
అలాగే అన్ని చోట్లకు వెళ్లాలని కోరారు. ఈ ప్రాంతంలోని కొన్ని చెక్ డ్యామ్ లు డ్యామేజ్ అవటంతో బాల్కొండలో పంట పొలాలు మునిగాయని, వారికి పంట నష్టం ఇస్తామని విమర్శించారు ప్రభుత్వం ధైర్యం చెప్పటం లేదని విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా కనీసం ప్రభుత్వాన్ని నిలదీస్తలేవన్నారు. ఇక్కడున్న ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. కేసీఆర్ లక్ష్మీ నరసింహా స్వామి భక్తుడు. గతంలో లింబాద్రి స్వామి వారికి రూ. 5 కోట్లు పేర్కొన్నారు కేటాయించారని పేర్కొన్నారు. దాంతో గుడిని అభివృద్ధి చేసుకున్నాం. ఐతే మహిళలకు టాయిలెట్స్, ఛేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. గుట్ట కింద అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం పూర్తి కావటానికి రూ. 20 లక్షలు అవసరం. ప్రభుత్వం వాటిని కేటాయించాలన్నారు. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధి కి కృషి చేయాలని కోరారు.
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >
సంచలన నిర్ణయం : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా!
Posted On 2026-07-25 11:36:32
Readmore >
బోరుబావుల కిందవరి సాగు వద్దు : వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Posted On 2026-07-25 11:13:48
Readmore >