డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఐదవ డివిజన్ బోర్గం ( పి) బిజెపి నాయకులు నరేష్ యాదవ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ప్రతిభ హాస్పిటల్ లో ఉన్న ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ నీరూపు రెడ్డి, ఆర్థోపెడిక్ డాక్టర్ వంశీధర్ రెడ్డి, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ పవన్ కుమార్, లు ఈ శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని, తాను అందించే సేవలు నిజమైన పేదవారికి దక్కినప్పుడే తనకు సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇకపై కూడా తాను పదవుల్లో ఉన్న లేకున్నా సమాజ సేవలో ఓ బాధ్యతగల పౌరునిగా నిరంతరం పేదవారి సంక్షేమం వారికి ప్రభుత్వాలపరంగా వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తాను నివసిస్తున్న ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తున్నానని దాంట్లో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. అనంతరం మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ ఆరోగ్య శిబిరానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించిందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో హాస్పటల్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఎర్రన్న, నాల్గవ డివిజన్ నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.