Posted on 2024-01-07 11:18:50
డైలీ భారత్, నెల్లూరు జిల్లా:నెల్లూరులో ఆదివారం తెల్లవారు జామునా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ ఆర్టీసీ బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా మరొకరు మృతి చెందారు.
బస్సులో ప్రయాణీస్తున్న 10 మందికి గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన వారిని కావలి ఆస్పత్రికి తరలించారు. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.తెలంగాణ ఆర్టీసీకి చెందిన టీఎస్ 05 జెడ్ 0249 నంబర్ బస్సు మిర్యాలగూడ నుంచి తిరుపతికి వెళ్తున్న క్రమంలో గుడ్లూరు మండలం మోచర్ల దగ్గర జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ధాన్యం లోడుతో వెళుతున్న లారీని టీఎస్ ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ప్రమాద స్థలంలోనే డ్రైవర్ వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. 10 మందికి గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించారు. నెల్లూరుకు వెళ్తుండగా సీత అనే మహిళ మృతి చెందింది.
గాయాలు అయిన కొందరిని కావలి ఏరియా ఆస్పత్రికి, ఇంకొందరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ వినోద్ నిద్రమత్తులో ఉండగా ఈ ఘటన జరిగిందని గుడ్లూరు పోలీసులు అనుమానిస్తు న్నారు.
డ్రైవర్ వినోద్ మృత దేహాన్ని కందుకూరు ఏరి యా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమా దంపై గుడ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు....
కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ
Posted On 2026-06-28 19:08:04
Readmore >
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >